K. J. Yesudas feat. K. S. Chithra - Kondalalo Nelakonna - From "Alludu Garu" Songtexte

Songtexte Kondalalo Nelakonna - From "Alludu Garu" - K. S. Chithra , K. J. Yesudas




కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కుమ్మర దాసుడైన కురువరత్తినంబి
యిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాం చక్కురవర్తి
దొమ్ములు చేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
కొండలలో నెలకొన్న
గమదని సగమాగగనిదమగస
కొండలలో సగసమ గదమని గమగదమని దసనిద మగదమగస
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
ఎదలోని శ్రీ సతి ఎపుడో ఎఎడబాటు కాగా
ఎనలేని వేదనలో రగిలిన వాడు
మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతి
మమతల కోవెలలో మసలని వాడు
నీతికి నిలిచిన వాడు దోషిగ మారెను నేడు
ప్రేమకే ప్రాణం వాడు శిక్షకు పాత్రుడు కాడు
ఆర్తరక్షక శ్రీ వేంకటేశ్వర కరుణతా
తోడు నీడై వాన్ని కాపాడు నేడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు



Autor(en): annamacharya, jonnavitthula, k.v. mahadevan



Attention! Feel free to leave feedback.