S. P. Balasubrahmanyam - Prema Prema Songtexte

Songtexte Prema Prema - S. P. Balasubrahmanyam




ప్రేమా... ప్రేమా... ప్రేమా... ప్రేమా...
Music
Music
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా...
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందె
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా...
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
Music
Music
Music
ఆకాశ దీపాన్నై నే వేచివున్నా
నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్న
కరుణించలేవ సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహ తోనే బ్రతికున్నా
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది
నిలిచిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
Music
Music
Music
నిమిషాలు శూలాలై వెంటాడుతున్న
ఒడి చేర్చుకోవ వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న
ఓర్దార్చిపోవ ఓసారి
ప్రేమించలేకున్న ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటు బ్రతికించలేవ
అది నాకు చాలే చెలీ
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందె
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా



Autor(en): V.NAGENDRA PRASAD, V NAGENDRA PRASAD



Attention! Feel free to leave feedback.