S. P. Balasubrahmanyam - Taralirada (From "Rudra Veena") Songtexte

Songtexte Taralirada (From "Rudra Veena") - S. P. Balasubrahmanyam

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతీ మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశలెరుగని గమనము కద
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడితలోనే లయ లేదా
కళకైనా కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ప్రయోజనం లేని వృథా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా మారే ఏరే పారే మరో పథం రాదా
మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కద
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం

Autor(en): ILAYARAJA, SIRIVENNELA SITARAMA SASTRY

Attention! Feel free to leave feedback.