paroles de chanson Pavuraniki Panjaraniki (From "Chanti") - S. P. Balasubrahmanyam
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం

కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ.ఓ.ఓ.ఓ.

తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి
చాకింది నా కన్న తల్లి
లాలించు పాటలో నీతంతా తెలిపీ
పెంచింది నా లోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు
కలనైన అపకారి కాను
చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా
ఇది తీరేదే కాదా.
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ.ఓ.ఓ.ఓ.
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
తాళంటే తాడనే తలిచాను నాడు
అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే ఋజువన్న నిజము
తరువాత తెలిసేమి ఫలము
ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం
నా మీద నాకేలే కోపం
నాతోనే వేదములా ఇది తీరని వేదనలా
నా మది లోపములా ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాదే పోదా.
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ.ఓ.ఓ.ఓ.
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం

Attention! N'hésitez pas à laisser des commentaires.