Karthik feat. Shreya Ghoshal - Nee Jathaga - From "Yevadu" текст песни

Текст песни Nee Jathaga - From "Yevadu" - Shreya Ghoshal , Karthik




నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీదాక నను రప్పించావే
నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్థం మార్చి
నేనంటే నువ్వనిపించావే
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
కల్లోకొస్తావనుకున్నా
తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా
రాలేదే? జాడైనా లేదే?
రెప్పల బయటే నేనున్నా
అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే? పైగా తిడతావే?
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
వదిలేస్తావ నన్నిలా
నీలోకం నాకంటే ఇంకేదో ఉందంటే
నమ్మే మాటలా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
తెలిసీతెలియక వాలింది
నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు
ఏం చేస్తాం చెప్పు?
తోచని తొందర పుడుతోంది
తెగ తుంటరిగా నను నెడుతోంది నీవైపు
నీదే తప్పు
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ
విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ
ఒకటవ్వాలిగా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి



Авторы: DEVI SRI PRASAD, SIRIVENNELA SITARAMA SASTRY


Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}