S. P. Balasubrahmanyam feat. S. Janaki - Sandya Ragapu (From "Indhrudu Chandhrudu") текст песни

Текст песни Sandya Ragapu (From "Indhrudu Chandhrudu") - S. P. Balasubrahmanyam , S. Janaki




సంధ్యా రాగపు సరిగమలో
తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల
పకపకలో
డోరేమి రాగాల జోరేమి
ద స ద నా ప్రేమ
నీ మీద... శ్రుతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో
తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల
పకపకలో
చినుకు చినుకు నడుములో
చిలుకలులికిపడునులే
హాయ్... కనుల కనుల నడుములో
అలల సుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో
వలపు మధువులొలికెలే
తనువు తనువు కదుపులో
తమకమొకటి మెరిసెలే
సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా
కన్నెలో సోయగాలు కంటితోనే తాగుమా
హంసలా ఆ.ఆ హాయిగా ఆమని రేయిలా వాలిపో ప్రియా
సంధ్యా రాగపు సరిగమలో
తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల
పకపకలో
డోరేమి రాగాల జోరేమి
ద స ద నా ప్రేమ
నీ మీద... శ్రుతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో
తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల
పకపకలో
ఎదుట పడిన బిడియమే
చెమట నుదుట చిలికెలే
వణుకు తొణుకు పరువమే
బడికి వయసు కలిపెలే
వలపు పొడుపు కథలలో
చిలిపి ముడులు విడెనులే
హాయ్... మరుల విరుల పొదలలో
మరుడి పురుడు జరిగెలే
తేనెలే దోచుకెళ్లే తుమ్మెదైగపోకుమా
గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా
పాటల తోటలో పల్లవే ప్రేమగా
పాడుకో ప్రియా... ఓ ఓ ఓ
సంధ్యా రాగపు సరిగమలో
తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల
పకపకలో
డోరేమి రాగాల జోరేమి
ద స ద నా ప్రేమ
నీ మీద... శ్రుతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో
తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల
పకపకలో
రచన: వేటూరి సుందరరామ మూర్తి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి



Авторы: VETURI, ILAYARAJA



Внимание! Не стесняйтесь оставлять отзывы.