Ghantasala feat. Jikki - Raave Radha Rani Raave Lyrics

Lyrics Raave Radha Rani Raave - Ghantasala , Jikki



రావే రాధా రాణీ రావే రాధ నీవే కృష్ణుడు నేనే
రమ్యమైన శారద రాత్రి రాస లీలా వేళ ఇదే
రాస లీలా వేళ ఇదే
రార కృష్ణా రారా కృష్ణా రాధ నేనే కృష్ణుడు నీవే
రమ్యమైన శారద రాత్రి రాస లీలా వేళ ఇదే
రాస లీలా వేళ ఇదే
వంపులతో సొంపు మరీ ఇంపొసగే యమునేదీ
సుందరి నీ వాలుజడే సొగసైన యమునా
హోయ్ నాటి తార కోటులు వీడే
నాటి పున్నమ జాబిలి ఈడే
రాధ నేనే కృష్ణుడు నీవే రాస లీలా వేళ ఇదే
రాస లీలా వేళ ఇదే
విరిసిన పూపొదలేవీ విరివనిలో విభుడేడీ
వికసించే నీ కనులా వెలిగేనే నీ విభుడు
హోయ్ మూగబోయే మానస మురళీ
మురిసి మ్రోగే మోహన రవళీ
రాధ నీవే కృష్ణుడ నేనే రాస లీలా వేళ ఇదే
రాస లీలా వేళ ఇదే
దేవి రాధా మాధవ లీలా పావనమ్ము బృందావనము
మనము రాధా కృష్ణులమేలే మధురమాయే వనము
మధురమాయే వనము
ఆహా
ఓహో హొ హొ ఒహోహో
ఊహూ హు హు హు
ఊహూ హు హు హు




Ghantasala feat. Jikki - Santhi Nivasam (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.