Harris Raghavendra feat. Madhumatha & Ustad Sulthan Khan - Kalalu Kane Lyrics

Lyrics Kalalu Kane - Harris Raghavendra feat. Madhumatha & Ustad Sulthan Khan



కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం
నిజ కలలతో తమకమ రూపం
పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము
లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా
మెల్లమెల్లగ వినిపించే ఘోషా
కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
తడికాని కాళ్ళతోటి కడలికేది సంభందం
నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబందం
ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి నామం
తెరవలేని మనస్సుకేలా కలలు గనే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమికోరి సాగినవో
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
కలలైనా కొన్ని హద్దులు ఉండును
స్నేహంలో అవి ఉండవుళే
ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే
ఆపుట ఎవరికి సాద్యములే
కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా.
చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఎకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే
కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
తెల్లవారు ఝాముల్లన్నీ నిద్రలేక తెలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే
నడిచేటి దారిలో నీ పేరు కనిపించా
గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించె
అపుడపుడు చిరు కోపం రాగా
కరిగెను ఎందుకు మంచులాగ
భూకంపం అది తట్టుకోగల్ము
మదికంపం అది తట్టుకోలేం
కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా.
చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా




Harris Raghavendra feat. Madhumatha & Ustad Sulthan Khan - 7/G Brundhavana Colony
Album 7/G Brundhavana Colony
date of release
24-06-2004



Attention! Feel free to leave feedback.