M.M Keeravani, S. P. Balasubrahmanyam & Sunitha - Sai Ante Thalli Lyrics

Lyrics Sai Ante Thalli - S. P. Balasubrahmanyam , M.M. Keeravani , Sunitha



సాయి అంటే తల్లీ...
బాబా అంటే తండ్రీ
సాయి బాబా, తోడేలేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యామూ...
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యామూ...
నువ్వోస్తామన్న ఆశతో
బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యామూ
కోటి చుక్కలమయ్యామూ
కన్నీటి చుక్కుల మయ్యాము
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యామూ...
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యామూ...
బోథలు చేసేదెవరు, మా బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు, మాతో గోళీలాడేదెవరు
బోథలు చేసేదెవరు, మా బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు, మాతో గోళీలాడేదెవరు
పాటలు పాడేదెవరు, మా పొరపాటులు దిద్దేదెవరు
పాటలు పాడేదెవరు, మా పొరపాటులు దిద్దేదెవరు
తీయగ కసిరేదెవరూ...
తీయగ కసిరేదెవరు, మా పై ప్రేమను కొసరేదెవరు
సాయీ...
జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా
నువ్వు కన్నులు తెరిచేదాకా, మా కంటికి కునుకేరాదు
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యామూ...
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యామూ...
ఆ. ఆ...
మాకిచ్చిన నీ విబూదినే నీకూ కాస్త పూసేమయ్యా లేవయ్యా సాయి లేవయ్యా
నీ చేతి చిన్నికర్రతో నిన్నే తట్టి లేపేమయ్యా లేవయ్యా బాబా లేవయ్యా
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షనీ
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షనీ
యివ్వాళ మేమడిగాము నీ ప్రాణ భిక్షనీ
నీ ప్రాణ భిక్షనీ
ఇచ్చేవరకు ఆగలేమూ
ఇచ్చేవరకు ఆగలేమూ
నువ్వొచ్చేవరకు వూరుకోమూ
నువ్వొచ్చేవరకు వూరుకోమూ
పచ్చి మంచినీరైనా తాకబోమూ
సాయి అంటే తల్లీ...
బాబా అంటే తండ్రీ
సాయి బాబా నీతోడేలేకా
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యామూ...
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యామూ...
ఆ... ఆ...
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సాయీ... సాయీ... సాయూ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి



Writer(s): M. M. KEERAVANI, CHANDRABOSE


M.M Keeravani, S. P. Balasubrahmanyam & Sunitha - Shirdi Sai (Original Motion Picture Soundtrack)
Album Shirdi Sai (Original Motion Picture Soundtrack)
date of release
13-08-2012



Attention! Feel free to leave feedback.