S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Dasarathi Lyrics

Lyrics Dasarathi - S. P. Balasubrahmanyam , K. S. Chithra



దాశరధీ కరుణాపయోనిధి
నువ్వే దిక్కని నమ్మడమా
నీ ఆలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామకోటి రచియించడమా
సీతారామస్వామి, నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి
దాశరధీ కరుణాపయోనిధి
గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా
నీ దర్శనమే ఇమ్మంటిని కాని
ఏల రావు
నన్నేల రావు
నన్నేల ఏల రావు
సీతారామస్వామి
సీతారామస్వామి, నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి
రామ, రసరమ్య ధామ, రమణీయ నామ
రఘువంశ సోమ, రణరంగ భీమ
రాక్షస విరామ, కమనీయ కామ
సౌందర్య సీమ నీరదశ్యామ
నిజభుజోద్ధామ, భూజనల లామ, భువన జయ రామ
పాహి భద్రాద్రి రామ పాహి
తక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
డాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము
నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
ప్రేమ రసాంతరంగ హృదయంగమ శుంగ శుభంగ రంగ బహురంగ దబంగ తుంగ
సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపుధుసంగ విభంగా
భూతల పతంగ
మధు మంగళ రూపము చూపవేమిరా
గరుడ గమన రారా
గరుడ గమన రారా



Writer(s): M.M. KEERAVANI, VEDA VYAS


S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Sri Ramadasu (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.