S. P. Balasubrahmanyam feat. Chitra - Thappukondi Babulu Lyrics

Lyrics Thappukondi Babulu - S. P. Balasubrahmanyam , K. S. Chithra



బాబు తప్పుకోండి అమ్మ తప్పుకోండి
కలెక్టర్ గారు వస్తున్నారు సైకిల్ మీద వస్తున్నారు
తప్పుకోండి బాబులు మా కలెక్టరమ్మ వస్తున్నారు తప్పుకోండయ్యా
తప్పుకోండి తల్లులు మా ఆవిడ గారు వస్తున్నారు తప్పుకోండమ్మా
మా ఆవిడ గారె కలెక్టరమ్మ
కలెక్టరమ్మె మా ఆవిడ గారు
ఊరేలే కలెక్టరమ్మ ఊరేగ వచ్చిందమ్మ అందరు వచ్చి హారతి పట్టండీ
చెప్పుకోండి బాబులు మా ఆయన గారి గొప్పతనాలు చెప్పుకోండయ్యా
చెప్పుకోండి తల్లులు మా ఆయన గారి మంచితనాన్ని చెప్పుకోండమ్మా
ఆఫీసులోని నే కలెక్టరండి
ఇంట్లో మీరే మా కలెక్టరండి
జిల్లాకు కలెక్టరైన డిల్లీ రాణిని అయిన ఇల్లుని దిద్దే ఇల్లాలినేనండీ
తప్పుకోండి బాబులు మా కలెక్టరమ్మ వస్తున్నారు తప్పుకోండయ్యా
ఫైల్లో నువ్వు పెట్టే సైను పెదవులు మీద
పెట్టాలమ్మ ముద్దు మురిపెం మరవద్దమ్మ భామా
పొద్దె జారిపోనికమ్మ భామా
డ్యూటీ అంతా పగలేనండి నైట్ కి డ్యూటీ మీతోనండి అలిగారంటే ఎట్టాగండి సారూ
నలగాలండి విరజాజులు శ్రీవారు
అయ్యాయో IAS అయ్యాకా సరసానికి టైమెదండి మీకింకా
ఆర్డర్ ఆఫీసులోనే వేస్తాను ఇంట్లో మీ ఆర్డరులె నే వింటాను
కార్యేషు దాసి అంటే కరణేషు మంత్రి అంటే అర్థం మొత్తం నీలో చూశానూ
చెప్పుకోండి తల్లులు మా ఆయన గారి మంచితనాన్ని చెప్పుకోండమ్మా
తప్పుకోండి బాబులు మా కలెక్టరమ్మ వస్తున్నారు
తప్పుకో ఏయ్ తప్పుకో అరె తప్పుకోవయ్య బాబు తప్పుకో
ఇదుగో నిన్నే ఎవరైనా చూస్తారు.
సేవలు అందే కలెక్టరమ్మ సేవలు చెస్తే
ఎట్టాగమ్మ చిత్రంగా ఉందని అందురు అంటారమ్మా
చొద్యంలాగే ఊరె చూస్తుందమ్మో
వెకువతోనే నిదుర లేచి ముంగిట్లోన
ముగ్గులు పెట్టి ముత్తైదువుగా ఉండేది స్త్రీ జన్మ
పసుపు కుంకుమ సౌభాగ్యం ఓయమ్మా
ఇంటికి దీపం అంటే ఇల్లాలే నా ప్రేమ రూపం అంటే నువ్వేలే
నీ చూపే నా పాపిట్లో సింధూరం నీ నవ్వే నా సిగలోన మందారం
నా కంటి పాపే నువ్వై నీ కంటి పాపే నేనై జంటై విడక ఉందాం వందేళ్లూ
తప్పుకోండి బాబులు మా కలెక్టరమ్మ వస్తున్నారు తప్పుకోండయ్యా
చెప్పుకోండి తల్లులు మా ఆయన గారి మంచితనాన్ని చెప్పుకోండమ్మా
మా ఆవిడ గారె కలెక్టరమ్మ
ఇంట్లో మీరే మా కలెక్టరండి
ఊరేలే కలెక్టరమ్మ ఊరేగ వచ్చిందమ్మ అందరు వచ్చి హారతి పట్టండీ
చెప్పుకోండి బాబులు(హే ఉండు) మా ఆయన గారి గొప్పతనాలు చెప్పుకోండయ్యా
తప్పుకోండి బాబులు మా కలెక్టరమ్మ
వస్తున్నారు తప్పుకోండయ్య తప్పుకో తప్పుకో



Writer(s): VANDEMATARAM SRINIVAS, VENNELAKANTI


S. P. Balasubrahmanyam feat. Chitra - Maa Aavida Collector (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.