Kaala Bhairava - Peniviti paroles de chanson

paroles de chanson Peniviti - Kaala Bhairava



నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసినా రారా
పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ
పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని
సూసీ సూడక సులకన సేయకు
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి
తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటీ
నరగోస తాకే
కామందువే
నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో
యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా



Writer(s): Ramajogayya Sastry, Sai Srinivas Thaman


Kaala Bhairava - Aravindha Sametha
Album Aravindha Sametha
date de sortie
23-10-2018



Attention! N'hésitez pas à laisser des commentaires.