Chitra - Telusuna (From "Sontham") текст песни

Текст песни Telusuna (From "Sontham") - Chitra



తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది
పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు
ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతడి తలపే నిండిపొయుంది
నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గుండెలో చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా



Авторы: DEVI SRI PRASAD, SIRIVENNELA SITARAMA SASTRY, CHEMBOLU SEETHARAMA SASTRY


Chitra - Devi Sri Prasad: Telugu Love Songs
Альбом Devi Sri Prasad: Telugu Love Songs
дата релиза
13-11-2014



Внимание! Не стесняйтесь оставлять отзывы.