Ghantasala - Ghana Ghana Sundara Songtexte

Songtexte Ghana Ghana Sundara - Ghantasala




హరి ఓం హరి ఓం హరి ఓం
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారమౌ
పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ప్రాభాత మంగళ పూజావేళ
నీ పద సన్నిధి నిలబడీ నీ పదపీఠిక తలనిడి
ప్రాభాత మంగళ పూజావేళ నీ పద సన్నిధి నిలబడీ నీ పదపీఠిక తలనిడీ
నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా
వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీపాద ధ్యానమే నిరతము నీ నామ గానమే
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీపాద ధ్యానమే నిరతము నీ నామ గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా భవహరా పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా
పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ
పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ
పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ
పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ





Attention! Feel free to leave feedback.