M.M.Keeravaani feat. K. S. Chithra - Nallka Nallani - From "Sye" Songtexte

Songtexte Nallka Nallani - From "Sye" - K. S. Chithra , M.M. Keeravani




నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాణ్ణెల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాణ్ణెల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా
ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
ఒళ్ళో పెట్టుకు లాలిపాడి జో కొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తేవాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఒప్పులకుప్ప వయ్యారిభామా ముద్దులగుమ్మ చెప్పవే బొమ్మ
ఒప్పులకుప్పకి వయ్యారిభామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆ! నేనా? నీతో సరిపోతానా?
నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువు పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువు పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకు పోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా
కాళ్ళా గజ్జా కంకాళమ్మా ఎవరోయమ్మా ఖజురహొ బొమ్మ
ఇంకెందుకులే దాపరికమ్మా నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
చీ! నేనా? నీతో సరిపోతానా?
సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నిను పెళ్లాడేవాణ్ణిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా
తెల్లారేసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడూ పెళ్లాలైపోయే దారి కాస్త చూపించెయ్యమ్మా



Autor(en): M.M. KEERAVANI, SHIVASAKTHI DATTA


Attention! Feel free to leave feedback.
//}