M.M.Keeravaani feat. Sunitha Upadrashta - Nenunnanani Songtexte

Songtexte Nenunnanani - M.M.Keeravaani feat. Sunitha Upadrashta




చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ... నీకేంకాదని
నిన్నటిరాతనీ... మార్చేస్తానని
తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలనీ
తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలనీ
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
గుండెతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ... నీకేంకాదని
నిన్నటిరాతనీ... మార్చేస్తానని
ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ
అందరు ఉన్నా ఆప్తుడ నువ్వై చేరువయ్యావనీ
జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావనీ
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ... నీకేంకాదని
నిన్నటిరాతనీ... మార్చేస్తానని
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ... నీకేంకాదని
నిన్నటిరాతనీ... మార్చేస్తానని





Attention! Feel free to leave feedback.