P. Susheela feat. S. P. Balasubrahmanyam - Idhi Megha Sandhesamo - From "Yedanthasthula Meda" Songtexte

Songtexte Idhi Megha Sandhesamo - From "Yedanthasthula Meda" - S. P. Balasubrahmanyam , P. Susheela




అహ. హా.హా.
అహహహ. హా
ఇది మేఘ సందేశమో. అనురాగ సంకేతమో
ఆ. ఆ. ఇది మేఘ సందేశమో. అనురాగ సంకేతమో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో.
ఇది మేఘ సందేశమో. అనురాగ సంకేతమో
అహ. హా.హా.
అహహహ. హా
వెల్లువలా పొంగే నా పాల వయసు
పల్లవి పాడేను నా మూగ మనసు
వెల్లువలా పొంగే నా పాల వయసు. ఆ. ఆ. ఆ.
పల్లవి పాడేను నా మూగ మనసు
నీ పాట నా బాట కావాలని
నింగి నేల కలవాలని
చినుకులు వేశాయి ఒక ఒంతెన
చినుకులు వేశాయి ఒక ఒంతెన
కలిసిన హృదయాలకది దీవెనా
ఇది మేఘ సందేశమో. అనురాగ సంకేతమో
తడిసిన తనువేదో కోరింది స్నేహం.
కలిగెను జడి వాన నాకు దాహం
తడిసిన తనువేదో కోరింది స్నేహం.
ఆ. హా.కలిగెను జడి వాన నాకు దాహం
నీ చెంత మేను మరవాలనీ
నీ కంటిలో పాప కావాలనీ
వలపులు చేశాయి వాగ్ధానము.హా. ఆ.
వలపులు చేశాయి వాగ్ధానము
మనకివి సిరులింక కలకాలము
ఇది మేఘ సందేశమో. అనురాగ సంకేతమో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో.
ఇది మేఘ సందేశమో. అనురాగ సంకేతమో



Autor(en): CHAKRAVARTHI, RAJASREE



Attention! Feel free to leave feedback.