P. Susheela feat. S. P. Balasubrahmanyam - Shiva Poojaku - From "Swarna Kamalam" Songtexte

Songtexte Shiva Poojaku - From "Swarna Kamalam" - S. P. Balasubrahmanyam , P. Susheela




శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
మ్రుదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
యతిరాజుకు జతి స్వరముల పరిమలమివ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా
పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకె సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వెదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించె కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నిదురించిన హ్రుదయరవలి ఒంకారం కాని
శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
మ్రుదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తొడుగా
పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
లలిత చరన జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హ్రుదయములో వికసిత షతదల శోభల సువర్ణ కమలం
పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా
స్వధర్మె మిధనం శ్రేయహ పరధర్మో భయావహ



Autor(en): ILAYARAJA, SIRIVENNELA SITARAMA SASTRY


Attention! Feel free to leave feedback.