S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Pallakilo Pelli Koturu - From "Pallakilo Pelli Koturu" Songtexte

Songtexte Pallakilo Pelli Koturu - From "Pallakilo Pelli Koturu" - S. P. Balasubrahmanyam , K. S. Chithra




చంపకు చుక్కను పెట్టి పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది
ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను
బోయిలుగా మలచిన పల్లకిలో...
పల్లకిలో...
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గుల వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా
బంగరు బొమ్మా బంగరు బొమ్మా
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మా
వెన్నెల బొమ్మా వెన్నెల బొమ్మా
పరిమళాల గంధపు బొమ్మా సున్నితాల గాజు బొమ్మా
పుట్టినింట లేతబోమ్మా మెట్టినింట సీతబోమ్మా
బొమ్మని అత్తింటికి పంపించే
ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము
మాటరాని బొమ్మలమయ్యాము
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
నా పెళ్ళిలో అతిధులు మీరేకదా
అతిధులంటే దేవుళ్ళనే అర్ధం కదా
పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది
నాపై మీ చల్లని చూపే వరముల వరదయింది
అతిధి దేవుడు దేవుణ్ణే కోరేది సౌఖ్యాంగా నువ్వుండాలని
నీ బ్రతుకంతా బాగుండాలనీ...
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే



Autor(en): M.M. KEERAVANI, CHANDRABOSE



Attention! Feel free to leave feedback.