S. P. Balasubrahmanyam feat. S. Janaki - Acha Acha - From "Rakshasudu" Songtexte

Songtexte Acha Acha - From "Rakshasudu" - S. P. Balasubrahmanyam , S. Janaki




అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
రేతిరవుతుంటే రేగే నాలో కచ్చా
పగటి పూటంతా ఒకటి ఇచ్చా
నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ
నీకు లేనందుకే నే మెచ్చా
కాసుకో ఘటోత్కచా కౌగిలే మజా
అందుకే ఇలా వచ్చా చూడవే మజా
చీకటింట చిత్తగించా అందమంతా అప్పగించా
ముద్దుమురిపాలు ముందే ఇచ్చా
ముద్దబంతుల్లో నిన్నే ముంచా
అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
సోకులెన్నెన్నో నీలో నేనే చూశా
మనసుతోపాటు మాటే ఇచ్చా
ఎన్ని రాత్రుళ్ళో నీకై నేనే వేచా
మనసులో నీకు చోటే ఇచ్చా
ప్రేమపూజకే వచ్చా అందుకో రోజా
చందమామనే తెచ్చా అందుకో రాజా
మోజులన్నీ మోసుకొచ్చా ఈడుజోడు రంగరించా
నీకు ప్రేమంటే తెలుసా బచ్చా
నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా
అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి



Autor(en): ILAYARAJA, VETURI



Attention! Feel free to leave feedback.