Songtexte Nee Jathaga (From "Yevadu") - Shreya Ghoshal , Karthik
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి...
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి...
నాకే తెలియని నను చూపించి,
నీకై పుట్టాననిపించి,
నీ దాకా నను రప్పించావే...
నీ సంతోషం నాకందించి,
నా పేరుకి అర్థం మార్చి,
నేనంటే నువ్వనిపించావే...
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి...
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి...
కల్లోకొస్తావనుకున్నా,
తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా,
రాలేదే? జాడైనా లేదే?
రెప్పల బయటే నేనున్నా,
అవి మూస్తే వద్దామనుకున్నా,
పడుకోవే? పైగా తిడతావే?
లోకంలో లేనట్టే, మైకంలో నేనుంటే,
వదిలేస్తావ నన్నిలా...
నీలోకం నాకంటే ఇంకేదో ఉందంటే
నమ్మే మాటలా...
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి...
తెలిసీ తెలియక వాలింది,
నీ నడుమొంపుల్లో నలిగింది,
నా చూపు, ఏం చేస్తాం చెప్పు?
తోచని తొందర పుడుతోంది,
తెగ తుంటరిగా నను నెడుతుంది
నీవైపు, నీదే ఆ తప్పు.
నువ్వంటే నువ్వంటూ,
ఏవేవో అనుకుంటూ,
విడిగా ఉండలేముగా.
దూరంగా పొమ్మంటూ,
దూరాన్నే తరిమేస్తూ,
ఒకటవ్వాలిగా...
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి...
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి...
Attention! Feel free to leave feedback.