Unnikrishnan & Sujatha - Poovullo Daagunna Songtexte

Songtexte Poovullo Daagunna - Sujatha , Unnikrashan




పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం
గిరులు తరులు ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం
వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్ పూల వాసన అతిశయమే
సంద్రం ఇచ్చిన మేఘం లో ఒక చిటికెడైనా ఉప్పుందా వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మినిగురులతిశయమే
తనువున ప్రాణం చోటనున్నదో ప్రాణం లోన ప్రేమ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే
గిరులు తరులు ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం
అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళన్ట నడిచొచ్చె నీవే నా అతిశయము
జగమున అతిశయాలు ఏడేనా మాట్లడే పువ్వా నువు ఎనిమిదొవ అతిశయమూ
నింగి లాంటి నీ కాళ్ళూ పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరు అధరాలు అతిశయమూ
మగువా చేతి వేళ్ళు అతిశయమే
మకుటాల్లాన్టి గోళ్ళు అతిశయమే
కదిలే ఒంపులు అతిశయమే
గిరులు తరులు ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం



Autor(en): A R RAHMAN, SIVA GANESH


Unnikrishnan & Sujatha - JEANS
Album JEANS
Veröffentlichungsdatum
30-10-1999



Attention! Feel free to leave feedback.
//}