Arijit Singh - Kanulanu Thaake - From "Manam" Lyrics

Lyrics Kanulanu Thaake - From "Manam" - Arijit Singh




టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
కనులను తాకే కల చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
మనసును లాగే మాయలా వేసే వలా
నీ నవ్వులే నేడిలా
ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
నీ ప్రేమే నే కోరుకున్నా
నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
నిన్నే నే ప్రేమించినా
కనులను తాకే కలా
హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగ నాతో సాగేనా
నాలో రేగింది గాయమే
దారే చూపేన కాలమే యేయేయేయే
నువ్వే నేనా నీ మౌనం నేనా
నీ ఊసే గుండెలోనా
నీతో లేనా ఆహా
కనులను తాకె కలా
చంద చందమామ రావా
మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
వాన వెన్నెల వాన రావా
నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి
దూరం ఎందాక తీసుకెళ్లునో
మౌనం నాటికి వీడిపోవునో
బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా
ఇంక జీవితం ఎందుకో
కంట కన్నీరు నింపేందుకో
నీతో రానా నీ నీడై పోనా
నీ కోపం వెంటాడుతున్నా
నీలో లేనా ఆహా




Attention! Feel free to leave feedback.