K. S. Chithra feat. S. P. Balasubrahmanyam - Andame Andamaa Lyrics

Lyrics Andame Andamaa - S. P. Balasubrahmanyam , K. S. Chithra



అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా ఆడుమా... పాడుమా. మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా
Music
Music
Music
ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక కిరెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
Music
Music
వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని చిచ్చి కోట్టనీ ఇలా... వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగల మారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆదుకో నాయనా... ఆర్చవా తీర్చవా చింత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ



Writer(s): C. Narayana Reddy, Shibu Chakravarthi, Veturi Sundara Ramamurthy


K. S. Chithra feat. S. P. Balasubrahmanyam - Chilakkottudu (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.