Lyrics Theta Theta Telugula (From "Prem Nagar") - Ghantasala
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
ఏరులా సెలయేరులా కలకలా గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
ఏరులా సెలయేరులా కలకలా గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాల వలె నాలో
పలికినది పలికినది పలికినది
చల్లగా చిరుజల్లుగా జలజల గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు
వెలిసినవి వెలిసినవి వెలిసినవి
వీణలా నెరజాణలా కలకల గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా

Attention! Feel free to leave feedback.