M.M. Keeravani - Nee Padhamula (Male) Lyrics

Lyrics Nee Padhamula (Male) - M.M. Keeravani




రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు
సాయినాథ్ మహరాజ్ కీ జై
నీ పదముల ప్రభవించిన గంగా, యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
సాయి నీ పదముల ప్రభవించిన గంగా, యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
క్షేత్రమైన, తీర్థమైన నీవేగా
జీవమైన, భావమైన నీవేగా
నీవు లేని చోటు లేదు సాయీ
జగమే నీ ద్వారకామాయీ
నీవు లేని చోటు లేదు సాయీ
జగమే నీ ద్వారకామాయీ
సాయి నీ పదముల ప్రభవించిన గంగా, యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
మనుజులలో దైవము నువ్వు
కోసల రాముడివై కనిపించావూ
గురి తప్పని భక్తిని పెంచావు
మారుతిగా అగుపించావూ
భక్త సులభుడవై కరుణించావూ
భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయీ
జగమే నీ ద్వారకామాయీ
నీవు లేని చోటు లేదు సాయీ
జగమే నీ ద్వారకామాయీ సాయి నీ పదముల ప్రభవించిన గంగా, యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
ఆరడుగుల దేహము కావు
భక్తుల అనుభూతికి ఆకృతి నీవూ
అందరికి సమ్మతమే నీవు
మతమన్నది లేదన్నావూ
అన్ని జీవులలో కొలువైనావూ
ఆత్మ పరమాత్మలు ఒకటేనన్నావూ
అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవూ
అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవూ
సృష్టి విలాసమునకే సూత్రధారి నీవు
సృష్టి విలాసమునకే సూత్రధారి నీవు
నీవు లేని చోటు లేదు సాయీ
జగమే నీ ద్వారకామాయీ
నీవు లేని చోటు లేదు సాయీ
జగమే నీ ద్వారకామాయీ



Writer(s): M. M. KEERAVANI, RAMAJOGAYYA SASTRY


Attention! Feel free to leave feedback.
//}