Nikhita Srivalli feat. Penchal Das & Kailash Kher - Yeda Poinado Lyrics

Lyrics Yeda Poinado - Kailash Kher , Penchal Das



కోనలో కూలినాడో
కొమ్మలో చేరినాడో
ఊరికో, వాడకో
యాడ బొయ్యాడో
రమ్ రుధిరం సమరం శిశిరం
రమ్ మరణం గెలవమ్ ఎవరం
యాడ బోయినాడో యాడ బోయినాడో
సింతలేని లోకం సూడబోయి నాడో
చారడేసి గరుడ పచ్చ కళ్లు వాల్చి
గరికపచ్చా నేలపైనే
సీమ కక్ష వేటు వేస్తే రాలిపోయినాడో
రమ్ రుధిరం సమరం శిశిరం
రమ్ మరణం గెలవమ్ ఎవరం
కట్టెలే సుట్టాలు కాడు మన తల్లితండ్రి
అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట
కాలవగట్టునా నీ కాళ్లు కాలంగా
కాకి శోకము బోతిమే
కాకి శోకము బోతిమే
నరక స్వర్గా అవధి దాటి
వెన్నామాపులు దాటీ
విధియందు రారానీ
తదియందు రారానీ
నట్టింట ఇస్తర్లు నాణ్యముగా పరిపించీ
మీ వారు చింతా పొయ్యేరూ
మీ వారు దు: పొయ్యేరూ
మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు రెక్కలు తొడిగేదెవరని
ఇంకని చెంపల పారే శోకం తూకం వేసేదెవరని
కత్తుల అంచున ఎండిన నెత్తురు కడిగే అత్తరు ఎక్కడని
ఊపిరాడని గుండెకు గాలిని కబలం ఇచ్చేదెవ్వరనీ
చుక్కేలేని నింగీ
ప్రశ్నించిందా వంగీ
కోనల్లో కూలినాడో
కొమ్మల్లో చేరినాడో
రమ్ రుధిరం సమరం శిశిరం
(రమ్ రుధిరం)
రమ్ మరణం గెలవం ఎవరం
హరోం హరీ నీ కుమారులిచ్చిన భక్ష భోజనములు రాగికానులు
ఇరం విడిచి పరం జేరిన వారి పెద్దలకు పేరంటాలకు
మోక్షాదిఫలము కల్గు
శుభోజయము
పద్నాలుగు తరాల వారికి మోక్షాదిఫలము కల్గును
శుభోజయము
శుభోజయము



Writer(s): Sirivennela Seetharama Sastry, Sai Srinivas Thaman, Penchal Das


Nikhita Srivalli feat. Penchal Das & Kailash Kher - Aravindha Sametha
Album Aravindha Sametha
date of release
23-10-2018



Attention! Feel free to leave feedback.