P. Susheela feat. S. P. Balasubrahmanyam - Andhaala Javvani Lyrics

Lyrics Andhaala Javvani - S. P. Balasubrahmanyam , P. Susheela



అందాల జవ్వని. మందార పువ్వని...
అందాల జవ్వని. మందార పువ్వని...
నేనంటె నువ్వని. నువ్వంటే నవ్వని
కలిసిందిలే కన్ను కలిసిందిలే. తెలిసిందిలే మనసు తెలిసిందిలే
అందాల గువ్వని... రాగాల రవ్వని.
నేనంటే నువ్వని. నువ్వంటే నవ్వని
కలిసిందిలే కన్ను కలిసిందిలే. తెలిసిందిలే మనసు తెలిసిందిలే
గోదారి నవ్వింది. పూదారి నవ్వింది
నవ్వు నవ్వు అందాలు రువ్వింది
చిలకమ్మ నవ్వింది. గొరవంక నవ్వింది
నవ్వు నవ్వు నెలవంకలయ్యింది
వెలుగుల్లో నీ రూపు వెన్నెళ్లు కాచే వేళ
జిలుగైన సొగసంతా సిరిపైటలేసే వేళ
చినుకంటి నీ కన్ను చిటికేసి పోయే వేళ
తెలుగుల్లో నా వలపు తొలి పాట పాడింది
అందాల గువ్వని... రాగాల రవ్వని.
వయసొచ్చి నవ్వింది. మనసిచ్చి నవ్వింది
వలపల్లే వాలాడు పొద్దుల్లో నవ్వింది
పూరెమ్మ నవ్వింది. పులకింతా నవ్వింది
నూగారు బుగ్గల్లో ముగ్గల్లే నవ్వింది
నీరాటి రేవుల్లో నీడల్లు ఆడే వేళ
నాలాటి ఊహల్లే మాటొచ్చి పాడె వేళ
బంగారు మలి సంధ్య రాగాలు తీసే వేళ
మబ్బుల్లో మెరుపు నను చూసి నవ్వింది
ఆ. అహ. ఆ. ఆ. ఆ. ఆ.



Writer(s): CHAKRAVARTHI, ARUDRA


P. Susheela feat. S. P. Balasubrahmanyam - Ooriki Monagaadu (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.