S. P. Balasubrahmanyam - Baba Saranam Baba Saranam Lyrics

Lyrics Baba Saranam Baba Saranam - S. P. Balasubrahmanyam




లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శరణం కోరుతూ
చరణలను చేరగా తలుపు తీసేర బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలుపెట్టీ ఆ.ఆ.
వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలుపెట్టి
పాద సేవ చేసుకునే వేల దాటిపోయేనని
ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికి
పెద్ద కొడుకంటే ముద్దులే తండ్రికి
అందుకనే గుండె నీ గురుపీఠమైనది
ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది
అంతకు మించిన భాగ్యమేదేరా బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శరణం కోరుతూ
చరణలను చేరగా తలుపు తీసేర బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచె తండ్రివీ నీవేనని
రూపముల ఏకములైన శ్రీ సాయివి
నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై
కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై
వెన్నంటే నువ్వుంటే లోటు లేదుగా బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శరణం కోరుతూ
చరణలను చేరగా తలుపు తీసేర బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా



Writer(s): J PURUSHOTHAMA, SAAHITHI, J PURUSHOTHAMA SAI


Attention! Feel free to leave feedback.
//}