S. P. Balasubrahmanyam - Nadakalu Choosthe Lyrics

Lyrics Nadakalu Choosthe - S. P. Balasubrahmanyam




చిత్రం: టక్కరి దొంగ చక్కని చుక్క (1969)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు
చక్కని చుక్కా... హే చక్కని చుక్కా
నడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ. ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో. లేత బంగారం
చూడు. ఇటు చూడు. పగవాడు కాదు జతగాడు
నవ్వు. అర నవ్వు. రతనాల పెదవిపై రువ్వు
చూడు. ఇటు చూడు. పగవాడు కాదు జతగాడు
నవ్వు. అర నవ్వు. రతనాల పెదవిపై రువ్వు
ఒక కంట మంటలను మెరిపించు
ఒక కంట మంటలను మెరిపించు
కాని. ఒక కంట మల్లెలను కురిపించు
ఓయబ్బో. ఏమి చెలిసొగసు... ఓయబ్బో. ఏమి తలబిరుసు
ఓయబ్బో. ఏమి చెలిసొగసు... ఓయబ్బో. ఏమి తలబిరుసు
నీనడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో. లేత బంగారం
ఊగి. అటు సాగి. ఒక నాగులాగ చెలరేగి
విసిరి. అటు కసిరి. తనువెల్ల చీకటులు ముసిరి
ఊగి. అటుసాగి. ఒక నాగులాగ చెలరేగి
విసిరి. అటు కసిరి. తనువెల్ల చీకటులు ముసిరి
పూట నన్ను ద్వేషించేవు
పూట నన్ను ద్వేషించేవు
కాని. ఆపైన నన్నె ప్రేమించేవు
ఓయబ్బో. ఏమి ఆవిరుపు... ఓయబ్బో. ఏమి మెరుపు
ఓయబ్బో. ఏమి ఆవిరుపు... ఓయబ్బో. ఏమి ఆమెరుపు
నీనడకలు చూస్తే మనసౌతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహ ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో లేత బంగారం
ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో లేత బంగారం



Writer(s): SATHYAM, DR. C NARAYANA REDDY, REDDY DR C NARAYANA



Attention! Feel free to leave feedback.