S. P. Balasubrahmanyam - Teppaga Marrakumeeda Lyrics

Lyrics Teppaga Marrakumeeda - S. P. Balasubrahmanyam



తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు - ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు
మోతనీటి మడుగులో యీతగరచినవాడు - పాతగిలే నూతిక్రింద బాయనివాడు
మూతిదోసిపట్టి మట్టిముద్ద పెల్లగించువాడు - రోతయన పేగుల పేరులు గలవాడు
కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు - బూడిద బూసిన వాని బుద్ధులవాడు
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు - దూడల నావుల గాచి దొఱయనవాడు
ఆకసానబారే వూరి అతివల మానముల - కాకుసేయువాడు తురగముపైవాడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి - యేకాలము బాయని యెనలేని వాడు



Writer(s): traditional


S. P. Balasubrahmanyam - S. P. Balasubrahmanyam Telugu Divine Hits
Album S. P. Balasubrahmanyam Telugu Divine Hits
date of release
01-07-2015




Attention! Feel free to leave feedback.