Sam C.S feat. Swagatha S. Krishnan - Jo Lali Jo Lyrics

Lyrics Jo Lali Jo - Sam C.S , Swagatha S. Krishnan




జో లాలి జో
జో లాలి జో
నీ లాలిపాటని మరిచావెలా
బంధమో
నీకున్నదీ నీ నీడల్లే నిన్నే చేరెనిలా
జో లాలి జో
జో లాలి జో
నీ లాలిపాటని మరిచావెలా
తానెవ్వరో
నువ్వెవ్వరో అమ్మ అంటూ గుండె పిలిచే
నువ్ చూసిన ప్రాణమే
నీతో నడిచే
కొంగు పట్టి వెంట కదిలే నీతో నీడలా
గాయం కనుపించనీ నీ గేయం ఇదిలే
ప్రాణమవనీ ప్రాణమేదో ప్రాణమే కోరెనే
వెన్నెల్లో పుట్టే నీ జాబిలమ్మ
నీ కంటి వెలుగై తానున్నదీ
నీకేమికానీ నీ భాగమేదో
నిను వీడిపోక తోడున్నదీ
కాలం మళ్లీ ఎదురవ్వదూ
దింపేసిన భారమే శ్వాసై కలిసే
నువ్వు కననీ జననమేదో నిన్నే చేరెనే
నువ్వే కని పెంచనీ నీ రూపం తనదో
అమ్మ అయినా అమ్మ కానీ అమ్మతో ఉన్నదో
పొద్దుల్లో అలసి నువ్ సోలిపోతే
నీ కురులే నిమిరే అమ్మలా
నీ కంటి వెనుకా కలలేవో తెలిసి
నీ ముందు నిలిపే పసి పాపలా
పాశం నిన్ను ప్రేమించెనే



Writer(s): Krishna Madineni, Sam C.s.



Attention! Feel free to leave feedback.