Vijay Prakash - Taanu Nenu Lyrics

Lyrics Taanu Nenu - Vijay Prakash



తాను-నేను మొయిలు-మిన్ను
తాను-నేను కలువ-కొలను
తాను-నేను పైరు-చేను
తాను-నేను వేరు-మాను
శశి తానైతే, నిశినే నేను
కుసుమం-తావి తాను-నేను
వెలుగు-దివ్వె తెలుగు-తీపి
తాను-నేను మనసు-మాను
దారి నేను, తీరం తాను
దారం నేను, హారం తాను
దాహం నేను, నీరం తాను
కావ్యం నేను, సారం తాను
నేను-తాను రెప్ప-కన్ను
వేరైపోని పుడమి-మన్ను
నేను-తాను రెప్ప-కన్ను
వేరైపోని పుడమి-మన్ను
తాను-నేను మొయిలు-మిన్ను
తాను-నేను కలువ-కొలను
తాను-నేను గానం-గమకం
తాను-నేను ప్రాయం-తమకం
తాను-నేను మొయిలు-మిన్ను
తాను-నేను కలువ-కొలను
తాను-నేను పైరు-చేను
తాను-నేను వేరు-మాను
శశి తానైతే, నిశినే నేను
కుసుమం-తావి తాను-నేను
వెలుగు-దివ్వె తెలుగు-తీపి
తాను-నేను మనసు-మేను
మనసు-మేను, మనసు-మేను
మనసు-మేను



Writer(s): Ananth Sriram, A R Rahman


Vijay Prakash - Saahasam Swaasaga Saagipo (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.