Karthik feat. Ravikrishna & SoniyaAgarwal - Kannula Baasalu paroles de chanson

paroles de chanson Kannula Baasalu - Karthik feat. Ravikrishna & SoniyaAgarwal



కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి, మరోవైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
ఇది అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి, ఆకు రాలిన
కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్ని తిన్నగాని
మనసు మాత్రం మరదులే
ఒకపరి మగువ చూడగనే
కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినమూ ఇక తపీయించే
యువకుల మనసులు తెలియవులే
హే, కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగవులే
ఒకవైపు చూపి, మరోవైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
అడవిలో కాచే వెన్నెల, అనుభవించేదేవ్వరులే
కన్నుల అనుమతి పొంది
ప్రేమ చెంతకు చెరదులే
దూరాన కనబడు వెలుగు
దారికే చెందదులే
మెరుపుల వెలుగును పట్టగ
మిణుగురు పురగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతమాట
కడగళ్లు నాకు సొంతమట
అల కడలి దటగనే
నురుగులిక ఒడ్డుకు సొంతమట
కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగవులే
ఒకవైపు చూపి, మరోవైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
లోకాన పడుచులు ఎందరున్ననూ
మనసోకరిని మాత్రమే వరియించులే
ఒకపరి దీవించ ఆశించగా
అది ప్రాణంతోనే ఆటాడులే
మంచుబిందువొచ్చి డీకొనగా
ముల్లే ముక్కలు ఐపోయేలే
భువిలో ఉన్న అబద్దాలే
అరె, చీరను కత్తి స్త్రీ ఆయేలే...
ఉప్పెనొచ్చిన, కొండ మిగులును
చెట్లు, చామలు మాయమవునులే
నవ్వు వచ్చులే, ఏడుపొచ్చులే
ప్రేమలో రెండూ కలిపె వచ్చులే
ఒకపరి మగువా చూడగనే
కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే
యువకుల మనసులు తెలియవులే
కన్నుల బాసలు.
ఏ, కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి, మరొవైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి, ఆకు రాలిన
కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని
మనసు మాత్రం మారదులే




Karthik feat. Ravikrishna & SoniyaAgarwal - 7G Brundhavana Colony
Album 7G Brundhavana Colony
date de sortie
24-06-2004



Attention! N'hésitez pas à laisser des commentaires.