M.M.Keeravaani feat. Shreya Ghoshal - Nuvve Na Shwasa paroles de chanson

paroles de chanson Nuvve Na Shwasa - Shreya Ghoshal , M.M. Keeravani



నువ్వే నా శ్వాస, మనసున నీకై అభిలాష
బ్రతుకైన నీతోనే, చితికైన నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ప్రియతమా, ప్రియతమా
నువ్వే నా శ్వాస, మనసున నీకై అభిలాష
పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు
తారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా
నీ జ్ఞాపకాలన్నీ, జన్మలోనైనా
నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ
ప్రియతమా, ప్రియతమా
నువ్వే నా శ్వాస, మనసున నీకై అభిలాష
సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహన్ని
దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయ లయలని
చోట నువ్వున్నా, నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ప్రియతమా, ప్రియతమా



Writer(s): M.M. KEERAVANI, CHANDRABOSE


M.M.Keeravaani feat. Shreya Ghoshal - Okariki Okaru
Album Okariki Okaru
date de sortie
01-01-2000



Attention! N'hésitez pas à laisser des commentaires.