Mohana Bhogaraju - Bullettu Bandi paroles de chanson

paroles de chanson Bullettu Bandi - Mohana Bhogaraju



హే పట్టుచీరనే గట్టుకున్నా
గట్టుకున్నుల్లో గట్టుకున్నా
టిక్కీబొట్టే వెట్టుకున్నా
వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా
నడుముకు వడ్డాణం జుట్టుకున్నా
జుట్టుకున్నుల్లో జుట్టుకున్నా
దిష్టి సుక్కనే దిద్దుకున్నా
దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా
పెళ్ళికూతురు ముస్తాబురో
నువ్వు యాడంగా వస్తావురో
చెయ్యి నీ చేతికిస్తానురో
అడుగు నీ అడుగులేస్తానురో
నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా
ఇట్టే వస్తా, రానీ వెంటా
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
చెరువు కట్టపొంటి చేమంతి వనం
బంతివనం చేమంతివనం
చేమంతులు దెంపి దండ అల్లుకున్నా
అల్లుకున్నుల్లో అల్లుకున్నా
మా ఊరు వాగంచున మల్లె వనం
మల్లె వనములో మల్లెవానమ్మ
మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా
నింపుకున్నుల్లో నింపుకున్నా
నువ్వు నన్నేలుకున్నావురో
దండ మెళ్ళోన ఏస్తానురో
నేను నీ ఏలువట్టుకోని
మల్లె జల్లోన ఎడతానురో
మంచి మర్యాదలు తెలిసినదాన్ని
మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో
పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో
మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో
ప్రేమనయ్యో, నేను ప్రేమనయ్యో
ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో
దాన్నిరయ్యో, ఒక్కదాన్నిరయ్యో
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో
ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో
పండు ఎన్నల్లో ఎత్తుకొని
ఎన్న ముద్దలు వెట్టుకొని
ఎన్ని మారాలు జేస్తు ఉన్నా
నన్ను గారాలు జేసుకొని
చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను
నీ చేతికిస్తారా నన్నేరా నేను
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా
వెట్టినంకుల్లో, వెట్టినంకా
సిరిసంపద సంబురం గల్గునింకా
గల్గునింకుల్లో, గల్గునింకా
నిన్ను గన్నోల్లే కన్నోల్లు అన్నుకుంటా
అన్నుకుంటుల్లో, అన్నుకుంటా
నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా
పంచుకుంటుల్లో, పంచుకుంటా
సుక్క పొద్దుకే నిద్రలేసి
సుక్కలా ముగ్గులాకిట్లేసి
సుక్కలే నిన్ను నన్ను చూసి
మురిసిపోయేలా నీతో కలిసి
నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా
నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ




Mohana Bhogaraju - Bullettu Bandi
Album Bullettu Bandi
date de sortie
07-04-2021




Attention! N'hésitez pas à laisser des commentaires.