S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Srirasthu Shubhamasthu paroles de chanson

paroles de chanson Srirasthu Shubhamasthu - S. P. Balasubrahmanyam , K. S. Chithra




శ్రీరస్తు శుభమస్తు
కొత్త పెళ్ళి కూతురా కళ్యాణమస్తు
శ్రీరస్తు శుభమస్తు
మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
మా గుండె గుడిలో ఆశల ఒడిలో
జ్యోతిని వెలిగించగా
శ్రీరస్తు శుభమస్తు
కొత్త పెళ్ళి కూతురా కళ్యాణమస్తు
పూజకే పువ్వు రుణమై పూసిందో కాలానికే తెలుసట
కాలం కను మూస్తే కలగా చెదిరేది జీవితమొకటేనట
సవతిగా కాకుండా చెల్లిగా నను చూసి తల్లిని చేసావుగా
నీ పారాణి పాదాలు సేవించినా గాని రుణమే తీరదుగా
ఇది కలకాలమై ఉండగా
నీ అనుబంధమే పండగా
ఇంటికి దీపం ఇల్లాలనిపించు
నా ముద్దు చెల్లాయిగా
శ్రీరస్తు శుభమస్తు
మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
ఎదిగే మరణాన్ని యెదలో దాచేసి కథ రాసే దేవుడు
పంతాల గిరి గీసి ప్రణయాన్ని ముడి వేసి మోసం చేసాడు
రాగాల వెన్నెల్ని రాహువుతో చంపి చీకటి మిగిలించితే
వేకువలా మళ్ళి రేకులు వెదజల్లే రవియై పుడతాడులే
దీపంలో నీ రూపమే
పాపల్లె ఆడాలనే
ఊపిరి ఉయ్యాలై ఊసుల జంపాలై ఒడిలో ఆడేనులే
శ్రీరస్తు శుభమస్తు
మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
శ్రీరస్తు శుభమస్తు
మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు




Attention! N'hésitez pas à laisser des commentaires.
//}