S. P. Balasubrahmanyam feat. K. S. Chithra & Sri Kumar - Goruvanka Valaga - From "Ghandeevam" paroles de chanson

paroles de chanson Goruvanka Valaga - From "Ghandeevam" - S. P. Balasubrahmanyam , K. S. Chithra , Sri Kumar

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా.
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా.
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా.
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా.
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై.
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా.
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా.
ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా.
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా.
నల్ల నల్ల నీళ్ళల్లోనా ఎల్లకిలా
పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో.
అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే
సూరీడమ్మా ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో.
ఎవరికివారే... . ఏఏ . ఏఏ యమునకు నీరే... ఏఏ . ఏఏ
రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే.
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా.
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా.
ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో.
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో.
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల
నవ్వే. బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో.
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు
నవ్వే. గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో.
పరవశమేదో... ఓఓఓ పరిమళమాయే. . ఏఏ . ఏఏ .ఓ
పువ్వు నవ్వే దివ్వె నవ్వే. జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే.
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా.
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా.
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా.
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా.
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై.

Attention! N'hésitez pas à laisser des commentaires.
//}