Shankar Mahadevan & Shreya Ghoshal - Neneppudaina - From "Ramayya Vasthavayya" paroles de chanson

paroles de chanson Neneppudaina - From "Ramayya Vasthavayya" - Shankar Mahadevan , Shreya Ghoshal




నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
గువ్వంత గుండెలో ఇన్నాళ్లూ
రవ్వంత సవ్వడే రాలేదు
మువ్వంత సందడిగ అలజడి రేగే ఎందుకో
కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మధువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
కన్నె కస్తూరినంత నేనై
వన్నె ముస్తాబు చేసుకోనా
చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా
ఇంటికింపైన రూపు నీవే
కంటిరెప్పైన వేయనీవే
నిండు కౌగిళ్ళలో
రెండు నా కళ్ళలో
నిన్ను నూరేళ్ళు బంధించనా
కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మధువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
మల్లె పూదారులన్ని నీవై
మంచు పన్నీరులన్ని నేనై
వసంతాల వలసే పోదాం సుఖాంతాలకే
జంట సందేళలన్ని నేనై
కొంటె సయ్యాటలన్ని నీవై
నువ్వు నా లోకమై
నేను నీ మైకమై
ఏకమౌదాము ఏనాడిలా
కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మధువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో



Writer(s): SAHITHI, S THAMAN


Attention! N'hésitez pas à laisser des commentaires.