Shreya Ghoshal feat. Dhanunjay - Nee Navve - From "Soggade Chinni Nayana" paroles de chanson

paroles de chanson Nee Navve - From "Soggade Chinni Nayana" - Shreya Ghoshal feat. Dhanunjay



నీ నవ్వే హాయిగ వుంది
ఊసే కొత్తగ వుంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హో హో
నీ నవ్వే హాయిగ వుంది
ఊసే కొత్తగ వుంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
ప్రతిక్షణమూ మనసుపడి
కలలుకనే నేనే అర్థం కానా
రుసరుసలే చూపిస్తున్నా
నను దూరం చేస్తూవున్నా
నాకోసం క్షణమయినా
ఆలోచిస్తే చాలన్నా
నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీకోసమే నే మారనా నీ తోడిలా నా తోడుగా ఉంటే
హొ హొ హొ హొ హొ
ఓ' నీ నవ్వే హాయిగ వుంది
ఊసే కొత్తగ వుంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురే చూసా
నీ ముద్దుముచ్చట కోసం
పడిగాపులు ఎన్నో కాసా
చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కావే
నీ శ్వాసలో గాలిలా నూరేళ్ళిలా నే వుండిపోతాలే
హొ హొ హొ హొ హొ
నీ నవ్వే హాయిగ వుంది
ఊసే కొత్తగ వుంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హో హో



Writer(s): ANUP RUBENS, CHANDRABOSE



Attention! N'hésitez pas à laisser des commentaires.