Shreya Ghoshal - Neelo Ninnu paroles de chanson

paroles de chanson Neelo Ninnu - Shreya Ghoshal



నీలో నిన్ను చూశా నేను
ఇకపై ఎటూ కనుపాపను మరలించను
నాలో నిన్ను దాచేశాను
పొరపాటున నువ్వడిగినా తిరిగివ్వను
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా
మనసు పడి దూసుకెలుతోంది నీ కలవైపుగా
(భగ భగ భగ వెలుగు నింపుకొని
నిదురలు చెరుపుతు తిరిగే సూర్యుడా
ఎద సడి తెలుపుకోగ మరి దొరకడు
నీలో ప్రేమికుడెక్కడా)
(నువ్వంటె నాకు పిచ్చి ప్రేమరా
మాటల్లొ దాన్ని చెప్పలేనురా
నా కళ్ళలోన మెరుపు చూడరా
నీ పాటె అది పాడుతోందిరా)
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా
మనసు పడి దూసుకెలుతోంది నీ కలవైపుగా
నీ రూపం
నీ రూపం అపురూపం
చిరునవ్వులేని చిరు లోపం
ఏదో చెబుతొంది ఎదలోతు లోటునీ నే రానా జత కానా
ఏదిలా మనసును అందించూ వీలుగా
ప్రేమగా దానిపై నా పేరే రాయగా
నీలో నిన్ను చూశా నేను
ఇకపై ఏటు కను పాపను మరలించనూ
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా (ఏమి చూసిందొ అడిగేలోపుగా)
మనసు పడి దూసుకెలుతోంది నీ కలవైపుగా
(భగ భగ భగ వెలుగు నింపుకొని
నిదురలు చెరుపుతు తిరిగే సూర్యుడా
ఎద సడి తెలుపుకోగ మరి దొరకడు
నీలో ప్రేమికుడెక్కడా
నువ్వంటె నాకు పిచ్చి ప్రేమరా
మాటల్లొ దాన్ని చెప్పలేనురా
నా కళ్ళలోన మెరుపు చూడరా
నీ పాటె అది పాడుతోందిరా)
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా
మనసు పడి దూసుకెలుతోంది నీ కలవైపుగా



Writer(s): Ajaneesh Loknath, Ramajogayya Sastry


Shreya Ghoshal - Kirrak Party (Original Motion Picture Soundtrack)




Attention! N'hésitez pas à laisser des commentaires.