Shreya Ghoshal - ThalachiThalachi(Female) paroles de chanson

paroles de chanson ThalachiThalachi(Female) - Shreya Ghoshal




తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని
తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాసా
నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని
కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కధనెపుడు
రాలిపోయిన పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీచేత
వడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వపం చాలులే ప్రియతమా కనులు తెరువుమా
మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా
చెరిగిపోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్షాలున్నా తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని



Writer(s): YUVAN SHANKAR RAJA, SHIVA GANESH


Attention! N'hésitez pas à laisser des commentaires.