Yuvan Shankar Raja, Haricharan & Shweta Pandit - Ela Ela Naalo paroles de chanson

paroles de chanson Ela Ela Naalo - Yuvan Shankar Raja , Shweta Pandit , Haricharan




ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం
ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart




Yuvan Shankar Raja, Haricharan & Shweta Pandit - Panjaa
Album Panjaa
date de sortie
19-11-2011




Attention! N'hésitez pas à laisser des commentaires.