A.R. Rahman feat. Abhay Jodhpurkar & Chinmayi - Allei Allei текст песни

Текст песни Allei Allei - Chinmayi Sripada , Abhay Jodhpurkar




ఆశ ఆగనందే... నిన్ను చూడకుంటే...
శ్వాస ఆడనందే... అంత దూరముంటే...
నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే
నిలువెత్తు ప్రాణం నిలవదటే
అల్లేయ్ అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్
నా చిట్టి చిలకా... జట్టై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్
ఏమంత అలక...? చాల్లే అల్లేయ్
నిను వెతికే నా కేకలకు... మౌనమే బదులైందే...
మౌనములో నీ మాటిదని... మనసే పోల్చుకుందే...
లాలన చేసే వీలే లేని పంతం వదిలి పలకవటే...!
అల్లేయ్ అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్
పుప్పొడి తునకా... గాలై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్
పన్నీటి చినుకా... జల్లై అల్లేయ్
ముడిపడిపోయాం ఒక్కటిగా... విడివడిపోలేక...
కాదనుకున్నా తప్పదుగా... వాదన దేనికిక...?
పదునుగ నాటే మన్మధబాణం నేరం ఏమీ కాదు కాదే...
అల్లేయ్ అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్
నా జతగువ్వా... జట్టై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్
నా చిరునవ్వా... జల్లై అల్లేయ్



Авторы: A R RAHMAN, SIRIVENNELA SEETHA RAMA SHASTR Y




Внимание! Не стесняйтесь оставлять отзывы.