K. S. Chithra - O Jabili текст песни

Текст песни O Jabili - Chitra



Johny johny
Yes papa
Eating sugar?
No papa
Telling lies?
No papa
Open your mouth
జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగని
అల్లరే మా ఎదకు పండగని
నవ్వులే మాకు తొలి పున్నమని
చిన్నారి జీవితాలె చిందులేసి ఆడని
జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగని
మెళకువలో కలలుగనే అందమైన మనసులివి
ఉరకలతో ఉరుములతో పరుగుతీయు వయసులివి
పసిమదిలో కసి ముదిరి చేరువైన గెలుపులివి
జగడములో ఎగసి పడే తీపి తీపి అలకలివి
తాయం పలికే కొంటె రాగమై
కాలం వడిలో జంట తాళమై
వెండిపూల వెన్నెలలో బ్రతుకు సాగని
జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగని
అలజడిలో అలసటలో సేద తీర్చు స్వర్గమిది
కలత కూడా కలత పడే మంచితనపు మలుపులివి
భువనములో ప్రతి మనిషి మరువలేని ఘటనులివి
హృదయములో పదిలముగా నిలిచిపోవు గురుతులివి
ఎగసే ఎదలో ఎన్ని ఆశలో
ఉరికే మదిలో ఎన్ని ఊసులో
చిన్ననాటి చిలిపితనం తిరిగిరాదులే
జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగని
అల్లరే మా ఎదకు పండగని
నవ్వులే మాకు తొలి పున్నమని
చిన్నారి జీవితాలె చిందులేసి ఆడని



Авторы: S.a. Rajkumar, Kulashekar


K. S. Chithra - Vasantham (Original Motion Picture Soundtrack)
Альбом Vasantham (Original Motion Picture Soundtrack)
дата релиза
11-10-2014



Внимание! Не стесняйтесь оставлять отзывы.