V. Selvaganesh feat. Karthik - Pada Pada текст песни

Текст песни Pada Pada - Karthik , V. Selvaganesh

పద పదమని తరిమినదే నిను చేరగ నన్నే నా హృదయం
ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మిగిలిన సమయం
ఉండిపోవా గుండెలోన ఉలుకై పలుకై ఊపిరివై
నిండిపోవా కళ్ళలోన కలవై వరమై కలవరమై
తెలియదు నాకు నీ పేరు
కాదులే మనమే వేరు
పద పదమని తరిమినదే నిను చేరగ నన్నే నా హృదయం
ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మిగిలిన సమయం
నీటిలోన మునిగిపోని నీడల రూపం మనదేనా
గాలిలోన నువ్వు రాసే కవితలు అన్నీ చదివేనా
నిను చూస్తూ కంటిపాప పుట్టిందేమో అనుకోనా
అందుకే నా రూపం తనలో కొలువై ఉంది ఎపుడైనా
తెలియదు నాకు నీ పేరు
ఓ. కాదులే మనమే వేరు
పద పదమని తరిమినది నిను చేరగ నన్నే నా హృదయం
ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మిగిలిన సమయం
నన్ను నేనే పోల్చుకోని అందం ఏదో నాలోన
ఎన్ని ఉన్నా నేను లేని లోటే ఉంది నీలోన
మౌనమే మన ఇద్దరి నడుమ నిచ్చెనలాగా మారెనుగా
దూరమే దారిని వెతికి నిన్నే నాతో కలిపెనుగా
తెలియదు నాకు నీ పేరు
ఓ. కాదులే మనమే వేరు
పద పదమని తరిమినదే నిను చేరగ నన్నే నా హృదయం
ఇది అది అని తెలపనిదే ఎడబాటుగా మిగిలిన సమయం
ఉండిపోవా గుండెలోన ఉలుకై పలుకై ఊపిరివై
నిండిపోవా కళ్ళలోన కలవై వరమై కలవరమై
తెలియదు నాకు నీ పేరు
కాదులే మనమే వేరు

Авторы: V. Selvaganesh, Karthik Netha

V. Selvaganesh feat. Karthik - Vennila Kabadi Kuzhu (Original Motion Picture Soundtrack)
Альбом Vennila Kabadi Kuzhu (Original Motion Picture Soundtrack)
дата релиза
17-10-2009

Внимание! Не стесняйтесь оставлять отзывы.