Mohana Bhogaraju - Reddamma Thalli (Film Version) текст песни

Текст песни Reddamma Thalli (Film Version) - Mohana Bhogaraju



ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లి. సక్కనైన పెద్ద రెడ్డెమ్మ
నల్లరేగడి నేలలోన ఎర్రజొన్న చేలలోన
నల్లరేగడి నేలలోన ఎర్రజొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లి. గుండెలవిసిపోయె కదమ్మా
సిక్కే నీకు సక్కనమ్మ పలవరేణి దువ్వెనమ్మ
సిక్కే నీకు సక్కనమ్మ పలవరేణి దువ్వెనమ్మ
సిక్కు తీసి కొప్పే పెట్టమ్మా
రెడ్డెమ్మ తల్లి. సింధూరం బొట్టు పెట్టమ్మా
కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలిపోయేనమ్మా
కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలిపోయేనమ్మా
కొలిచి నిన్ను వేడినాడమ్మా
రెడ్డెమ్మ తల్లి. కాచి మమ్ము బ్రోవు మాయమ్మా
నల్లగుడిలో కోడి కూసే మేడలోన నిదుర లేచే
నల్లగుడిలో కోడి కూసే మేడలోన నిదుర లేచే
సక్కనైన పెద్ద రెడ్డెమ్మా
బంగారు తల్లి, సత్యమైన పెద్ద రెడ్డెమ్మా
సత్యమైన పెద్ద రెడ్డెమ్మా
సత్యమైన పెద్ద రెడ్డెమ్మా



Авторы: Penchal Das, S Thaman


Mohana Bhogaraju - Aravindha Sametha
Альбом Aravindha Sametha
дата релиза
23-10-2018




Внимание! Не стесняйтесь оставлять отзывы.