S.P. Balasubrahmanyam - Chinnari Rani текст песни

Текст песни Chinnari Rani - S. P. Balasubrahmanyam




మాటే రాని చిన్న దాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలు రా.
రేగే మూగ తలపె వలపు పంట రా.
మాటే రాని చిన్న దాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలు రా.
రేగే మూగ తలపె వలపు పంట రా.
వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆద మరిచి ప్రేమను కొసరెను
చందనాలు ఝల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్న జాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే
మాటే రాని చిన్న దాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
సంధె వేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులె నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్ని ఇక నావే
మాటే రాని చిన్న దాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలు రా.
రేగే మూగ తలపె వలపు పంట రా.
మాటే రాని చిన్న దాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు



Авторы: S P Kodandapani, Gopi



Внимание! Не стесняйтесь оставлять отзывы.