A. R. Rahman - Vellipomaakey (From "Sahasam Swasaga Sagipo") Songtexte

Songtexte Vellipomaakey (From "Sahasam Swasaga Sagipo") - A.R. Rahman & Sid Sriram




కాలం నేడిల మారెనె
పరుగులు తీసెనె
హృదయం వేగం వీడదే
వెతికే చెలిమే నీడై నన్ను చేరితే
కన్నుల్లో నీవేగా నిలువెల్లా
స్నేహంగా తోడున్న నీవే
ఇక గుండెలో ఇలా
నడిచే క్షణమే
ఎదసడి ఆగే ఉపిరి పాడే పెదవిని వీడే
పదమొక కవితై
మది నీ వశమై నువు నా సగమై
ఎదలో తొలిప్రేమే కడలై ఎగిసే వేళా
పసివాడై కెరటాలే క్షణం
చూడనా చూడనా
ఎగిరే నింగి దాక ఉహల్నే రెక్కల్లా చేసిందే భావం
కాలాన్నే కాజేసే కళ్ళ కౌగిల్లో
కరిగే కలలేవో...
వెన్నెల్లో వేదించే వెండి వానల్లో వెలిగే మనమే
మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే
పన్నీటి జల్లై ప్రాణమే తాకే
ఊపిరే పోసే ఇది తొలి ప్రణయం
మనమాపినా ఆగదే
ఎన్నడూ వీడదే
వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
భాషే తెలియందే లిపి లేదే కనుచూపే చాలందే
లోకాలంతమైనా నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే
మనసుని తరిమే చేలిమొక వరమే
మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే
ప్రణయపు కిరణం ఎదకిది అరుణం
కనులకి కనులని ఎర వేసిన తొలి తరుణం
మది నదిలో ప్రేమే మెరిసే
అనుమతి అడగక కురిసే
నీలో నాలో హృదయం ఒకటై పాడే
కలలిక కనులని వీడవే
మనసిక పరుగే ఆపదే
మనసిక పరుగే ఆపదే
నీలో నాలో
నీలో నాలో
నీలో నాలో
పాడే...



Autor(en): A R RAHMAN, SREEJO


A. R. Rahman - Vellipomaakey (From "Sahasam Swasaga Sagipo")
Album Vellipomaakey (From "Sahasam Swasaga Sagipo")
Veröffentlichungsdatum
10-06-2016



Attention! Feel free to leave feedback.
//}