Songtexte




మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే
స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే
దరి వెతికెదనే నెచ్చెలి
నిన్నెట కాంచెదనే
నిత్య నిశీధి ఇది
చీకటి శూన్యమే మిగిలినదే
చిత్ర నయనమిది
చక్కని చక్కెర పలుకులెవి
సుందరహాసమెది
కావేరి నురగల పరుగులెవి
మంచుమబ్బులవలే ప్రేమగా
తడిమిన చేతులెవి
గోరు వెచ్చ కాంతుల వేకువై
వెలిగిన చూపులెవి
మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే
ఆరని జ్వలనమయే
హృదయం తీరని నరకమయే
ప్రాణం శిధిలమయే సమయం
చలనము లేనిదయే
నిప్పుల ఉప్పెనలో
నన్నిలా ముంచితివెందులకే
నేరము చెయ్యక
శిక్షలో వగచితి నీ కొరకే
మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే
స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే



Autor(en): Copyright: Tips Industries Limited


Attention! Feel free to leave feedback.
Wird geladen
Wird geladen